ఇవాళ అరుదైన చంద్రగ్రహణం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. 150 సంవత్సరాల తర్వాత గురు పౌర్ణమి రోజున ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఇది.
అయితే.. ఈ చంద్రగ్రహణాన్ని ధనస్సు, మకర రాశుల్లో జన్మించిన వాళ్లు చూడకూడదట. ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో పుట్టినవాళ్లు కూడా ఈ గ్రహనాన్ని చూడకూడదని చెబుతున్నారు. అయితే… గ్రహణం పట్టే సమయం అర్ధరాత్రి 1.30 నుంచి ఉదయం 4.30 మధ్య కావడంతో అది దాదాపు అందరూ నిద్రించే సమయం కావడంతో.. ఈ గ్రహణం వల్ల పెద్దగా ఆ రాశుల్లో జన్మించిన వాళ్లు, ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
అంతే కాదు.. ఇవాళ ఏర్పడబోతున్న చంద్రగ్రహణం.. పాక్షికమైనది.. కాకపోతే అది ప్రభావవంతమైనది. అందుకే.. ఆ నక్షత్రాలు, రాశుల్లో జన్మించిన వాళ్లు.. గ్రహణం విడిచిన తర్వాత బుధవారం ఉదయం శివాలయానికి వెళ్లి అభిషేకం, అర్చన చేస్తే మంచిది. లేదంటే… కనీసం ఇంట్లోనైనా 108 సార్లు ఓం నమశ్శివాయ అంటూ శివపంచాక్షరి జపించినా కూడా గ్రహణం వల్ల కలిగే అరిష్టాలు దూరమవుతాయని వేద పండితులు చెబుతున్నారు.