తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా టీవీ -5 అధినేత బీఆర్ నాయుడుని ఏపీ సర్కార్ నియమించిన విషయం తెలిసిందే.తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడంపై తాజాగా బీఆర్ నాయుడు స్పందించారు. ఇంత గౌరవమైన పదవి ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు, ఎన్డీయే పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అర్చకుల నుంచి వేదాశీర్వచనం తీసుకున్న తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు.
ఏడాదికి ఐదు సార్లు తిరుమలకు వెళ్లేతాము.. గడిచిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు వెళ్లలేదన్నారు.గత ప్రభుత్వం తిరుమలలో అనేక అరాచకాలు చేసిందని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన తాను .. చిన్నప్పటి నుంచి తిరుమలకు తప్పా మరో ఆలయానికి వెళ్లలేదన్నారు.గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రంగా లేదని వెళ్లలేదని చెప్పుకొచ్చారు. ఏటా ఆలయానికి వెళ్లే తాము..ఐదేళ్లు వెళ్లలేదంటే ఆ బాధెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. టీటీడీ ఛైర్మన్ పదవి రావడం తన జీవితంలో కొత్త మలుపుగా భావిస్తున్నా అని, ఆ పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటానని చెప్పారు.