అప్పులు చేసి దివాలా తీయించడానికేనా తెలంగాణ తెచ్చుకుంది? – భట్టి

-

మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డ అన్నారు కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తోందన్నారు. అధికార అహంకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీడియాను గుప్పిట్లోకి తీసుకొని భయపెట్టో.. ప్రలోభ పెట్టో… వారికి అనుకూలంగా ప్రచార ఆర్భాటం చేస్తున్నాయని ఆరోపించారు.

కాంగ్రెస్ సిద్ధాంత భావజాలమే ప్రజలను ఆకర్షిస్తుంది. పార్టీని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఎనిమిది సంవత్సరాలుగా టిఆర్ఎస్, బిజెపిలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గాలంటే బిజెపిని ఓడించాలన్నారు. దేశ సంపదను అమ్ముతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నియంతృత్వ పోకడలతో దేశాన్ని ఏలుతున్న బిజెపిని మునుగోడులో ఓడించి ఇక ప్రజా వ్యతిరేక పాలన చాలు అన్న సందేశాన్ని మునుగోడు ప్రజలు దేశానికి ఇవ్వాలన్నారు.

ధరల పెరుగుదలతో దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారే తప్పా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కానీ మునుగోడు ప్రజలకు బ్రహ్మాస్త్రంగా ఉన్న ఓటుతో వారికి బుద్ధి చెప్పాలన్నారు. 8సంవత్సరాలుగా తెలంగాణ సంపదను టిఆర్ఎస్ పాలకులు దోపిడీ చేయడమే కాకుండా ఐదు లక్షల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళ తీయించారని ఆరోపించారు. మిషన్ భగీరథ, చెరువుల పూడిక తీత పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు భట్టి. ప్రతి పౌరుడు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలసరి అప్పు 2.25 లక్షలు భారం మోపాయన్నారు. అప్పులు చేసి తెలంగాణను దివాలా తీయించడానికేనా? కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version