కరోనా వైరస్ కారణంగా ప్రతీ ఒక్కరు మాస్క్ ని తప్పక ధరించడం నిత్యకృత్యమైంది. ఎవరి రక్షణ కోసం వాళ్ళు ఈ మాస్కులు పెట్టుకునే ఉన్నారు. షాపింగ్ మాల్స్ వగైరా చోట్ల లో కూడా వీటిని కంపల్సరీ ధరించాలని నియమాలు కూడా పెట్టారు. ఇలా అవ్వడం తో వాడి పడేసిన మాస్కుల గుట్టలు పేరుకుపోతున్నాయి. ఇలా వ్యర్థాలు పేరుకు పోవడం పై పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇది ఇలా ఉంటె 2020 లెక్కల ప్రకారం మన దేశ రాజధాని ఢిల్లీ లో సుమారు 1.87 కోట్ల మంది జనాభా ఉంటున్నారు.
దీని ప్రకారం వంద మంది లో కనీసం ముగ్గురు ప్రతి రోజు ఒక్క మాస్క్‌ను ఉపయోగించి దానిని పడేస్తే…. ఆ వ్యర్థాల తో రోజుకి ఒక గ్రౌండ్ ని ఫీల్ చేసేయ వచ్చు అని పర్యావరణవేత్తలు చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉండగా అందరినీ కాకుండా కేవలం ఆరోగ్య కార్యకర్తలను తీసుకుని మాస్కుల వినియోగాన్ని చూస్తే.. మన దేశ వ్యాప్తంగా సుమారు 20 నుంచి 30 లక్షల మాస్కులను ప్రతి రోజు వారు వినియోగిస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇలా వ్యర్థాలు పేరుకుపోవడం పై పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
ఈ మాస్కులు మట్టి లో కలవడానికి ఎన్ని ఏళ్ళు పడతాయి అనే విషయానికి వస్తే… పూర్తిగా మట్టి లో కలిసేందుకు సుమారు 50 ఏండ్లు పడుతుందని చెబుతున్నారు. మామూలుగా మాస్కులని పాలీప్రొఫైలిన్, రబ్బరుతో తయారు చేస్తారని, పాలీప్రొఫైలిన్ పొర డీకంపోజ్ కావడానికి దాదాపు 20-30 సంవత్సరాలు, రబ్బర్ బ్యాండ్ పూర్తిగా ఉనికిని కోల్పోవటానికి 50 సంవత్సరాలు పడుతుందట. ఇలా మొత్తం మట్టి లో కలిసేందుకు 50 ఏండ్లు పడుతుందని తెలిపారు