శృంగారానికి ముందు వీటిని తీసుకుంటే కోరిక రెట్టింపు అవుతుందట తెలుసా?

-

కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల కామ కోరికలు రెట్టింపు అవుతుందని నిపుణులు అంటున్నారు..కిస్, హగ్, సెక్స్ వంటివి కేవలం శారీరక సుఖం కోసమే కావు.. ఇవి ఇద్దరి మధ్య బంధాన్ని మరింత స్ట్రాంగ్ గా చేయడానికి సహాయపడతాయి. అందుకే వైవాహిక జీవితంలో ఇవి కూడా అతి ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ కోరికలను ఆక్సిటోసిన్ అనే హార్మోన్ బాగా పెంచుతుంది. ఈ ఆక్సిటోసిన్ నే లవ్ హార్మోన్ అని కూడా అంటారు..

కొన్ని రకాల ఆహారాలను తింటే ఆక్సిటోసిన్ బాగా పెరుగుతుంది. దీంతో భాగస్వామి పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. ముద్దు మురిపాలలో మునిగిపోతారు. ఇందుకు మీరు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆరెంజ్ సిట్రస్ పండు. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటారు. ఇవి శరీరంలో పాజిటీవ్ ఫీలింగ్స్ ను కలిగిస్తాయి. అంతేకాదు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. అలాగే భాగస్వామిపై ప్రేమను కురిపించేలా చేస్తాయి..

నచ్చిన వారితో కలిసి కప్పు కాఫీ తాగాలని చాలా మందికి ఉంటుంది. అందుకే కాఫీ షాపుల్లో ప్రేమ జంటలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే కాఫీలో ఉండే కెఫిన్ ఆక్సిటోసిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మనలో దాగున్న భావోద్వేగాలను ప్రెరెపిస్తుంది..దాంతో రొమాన్స్ చెయ్యాలన్నా కోరిక పెరుగుతుంది..

చియా విత్తనాలతో భావోద్వాగాలు ఉత్తేజితం అవుతాయి. అంతేకాదు మీ ఫీలింగ్స్ ను భాగస్వామికి సులువుగా చెప్పగలుగుతారు. కావాలంటే వీటిని నానబెట్టి కూడా తీసుకోవచ్చు..

డార్క్ చాక్లెట్ పేరు వినగానే.. నోట్లో లాలాజలం ఊరుతుంది. ఇది టేస్ట్ లోనే కాదు.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు మటుమాయం అవుతాయి. అయితే దీన్ని తినడం వల్ల మనసులో ఉన్న ప్రేమ కూడా బయటకు వస్తుంది..దాంతో రొమాన్స్ చెయ్యాలన్నా కోరిక పెరుగుతుంది..

బ్రొకలి..ఈ పేరు వినగానే చాలా మంది ఆలోచనలో పడటం సహజం..పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అంతేకాదు లవ్ హార్బోన్ అయిన ఆక్సిటోసిన్ ను కూడా పెంచుతుంది…వీటిని తరచూ తీసుకోవడం వల్ల శృంగార కోరికలు రెట్టింపు అవుతాయి.. డైలీ ఆహారం లో చేర్చుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Exit mobile version