లోదుస్తులని ఇలా ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు వస్తాయి తెలుసా..?

-

చాలా మంది లో దుస్తులని ప్రతి రోజు ఎక్కువ కాలం వాడుతూ వుంటారు. అవి పాతవి అయి పోయినా లేదా చిరిగిపోయిన సరే కొత్తవి కొనుగోలు చెయ్యకుండా పాత వాటితో కాలక్షేపం చేసేస్తూ వుంటారు. కానీ వీటిని తరచుగా మారుస్తూ ఉండాలి. లేదు అంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అని నిపుణులు చెబుతున్నారు.

దీని వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని ఈరోజు యూకే నిపుణులు లోదుస్తులను ఎంత కాలం ఉంచుకోవచ్చు అనే దానిపై పలు విషయాలు చెప్పారు. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా అవసరం.

మహిళలు బ్రా ని ఎక్కువ సంవత్సరాలు వాడకూడదు అని అంటున్నారు. రీసెర్చ్ ప్రకారం ఎక్కువ సంవత్సరాలు పాటు వాడడం వల్ల ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. కాస్మెటిక్ డాక్టర్ లో దుస్తులను ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉంచుకోకూడదు అంటున్నారు.

సంవత్సరం తర్వాత కొత్త వాటిని వాడాలని చెబుతున్నారు. బాక్టీరియా మొదలైనవి లో దుస్తుల్లో ఉండిపోతాయి అవి ఉతికినా సరే పోవు అని అంటున్నారు. మహిళలు కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.

బ్రా లో ఉండే బ్యాక్టీరియా నిజంగా ఇబ్బందులకు దారి తీస్తుంది కాబట్టి మహిళలు కూడా లో దుస్తులని ఏడాది తర్వాత మార్చేయాలి. వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాలి. ఇలా చేస్తే లోదుస్తులు కారణంగా సమస్యలు రాకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version