మహమ్మారి టైమ్ లో విటమిన్ డి ప్రాముఖ్యత.. లోపం వల్ల అనర్థాలు

-

శరీరానికి విటమిన్లు చాలా అవసరం. అవి సరైన పాళ్ళలో లేకపోతే శరీరం సక్రమంగా పనిచేయదు. అందువల్ల శరీరానికి విటమిన్లు కావాలి. ప్రస్తుత సమయంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండడంతో బయటకి రావడానికి భయపడుతున్నారు. దానివల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఎముకలు బలంగా తయారవడానికి విటమిన్ డి చాలా అవసరం.

విటమిన్ డి ఎందుకు ముఖ్యమంటే,

విటమిన్ డి వల్ల ఎముకలు ఆరోగ్యంగా తయారవుతాయి. నాడీ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అంతేకాదు కణాల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే విటమిన్ డి విషయంలో నిర్లక్ష్యం చేయరాదు.

అసలు విటమిన్ డి అంటే,

ఇది ఒక స్టెరాయిడ్ హార్మోన్.. సూర్యుడి నుండి వచ్చే కిరణాల వల్ల ఇది ఆక్టివేట్ అవుతుంది. లేదా మనం తీసుకునే కొన్ని ఆహారాల్లో ఉండే పోషకాల ద్వారా ఆక్టివేట్ చెందుతుంది. దీనివల్ల ఎముకలకి ఆరోగ్యమే కాదు, శరీరంలో అనేక ప్రక్రియలు సరిగ్గా జరగడానికి విటమిన్ డి అవసరం. శరీరానికి కాల్షియం ఇమడాలంటే విటమిన్ డి కావాలి.

విటమిన్ డి లోపం

విటమిన్ డి లోపం వల్ల అనేక వ్యాధులు సంభవిస్తాయి. చిన్నపిల్లల్లో రికెట్స్, పెద్దల్లో ఎముకలకి చెందిన ఇతర వ్యాధులు వస్తాయి. కొన్ని కొన్ని సార్లు ఇవి చాలా ప్రమాదకరంగా మారతాయి. విటమిన్ డి లోపం బ్రెస్ట్ క్యాన్సర్, కోలోన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది.

మహమారి టైమ్ లో సూర్యరశ్మి తగలకుండా ఇంట్లోనే ఉండడం వల్ల విటమిన్ డి లోపం ఎక్కువ అవుతుంది. దీనివల్ల చాలామందిలో ఎముకలకి సంబంధించిన సమస్యలు, అధిక ఒత్తిడి, నాడీ సంబంధ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.

విటమిన్ డి లోపం వల్ల కలిగే లక్షణాలు

అలసట, నొప్పులు, ఆరోగ్యంగా లేకపోవడం, ఎముకల నొప్పి, కండరాల నొప్పి మెట్లు ఎక్కుతున్నప్పుడు బలహీనంగా అనిపించడం మొదలగునవి ఉంటాయి.

విటమిన్ డి దొరికే ఆహారాలు

చేపలు
కాడ్ లివర్ ఆయిల్
గుడ్డు పచ్చసొన
పాలు
పెరుగు
ఆరెంజ్ జ్యూస్

Read more RELATED
Recommended to you

Exit mobile version