కేటీఆర్ మరి ఇంతలా దిగజారుతాడని అనుకోలేదని అన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేయక పోతే జీతాలు ఇవ్వని పరిస్థితి… భూములు అమ్మక పోతే పూట గడవని పరిస్థితి లో ఉందన్నారు. అప్పులు చేయడం తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వం వేరే ఇతర ఏ పని చేయడం లేదన్నారు. తాను కేటీఆర్ గురించి ఎక్కువగా మాట్లాడబోనన్నారు.
తెలంగాణలో బిజేపీ అధికారంలోకి రాగానే.. న్యాయబద్దంగా గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. తెలంగాణకు కేంద్రం అవార్డులు ఇస్తే హర్షం వ్యక్తం చేస్తారు… కానీ లోపాలు చెబితే పక్షపాతం అంటారా అని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం పక్షపాతం వహిస్తే అవార్డులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కేసీఆర్ లాగా మేము స్వార్ధ పరులం కాదు.. ఎవరికి భయపడమని అన్నారు ఈటల రాజేందర్.
గవర్నర్ అంటే కేసీఆర్ కి గౌరవం లేదన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ రెండు రోజులు నడిపి సరిపెడతారా ? అని మండిపడ్డారు. ఈటల రాజేందర్ ని ఎందుకు అసెంబ్లీలో ఉండనివ్వడం లేదని ప్రశ్నించారు. అన్ని విషయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.