న్యూ ఇయర్ గిఫ్ట్: జనవరి 1 నుంచి ఆ చార్జీలుండవోచ్‌..

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్‌ అందించారు. దేశంలో డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రుపే డెబిట్‌ కార్డు, యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా చెల్లింపులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌) చార్జీలను ఎత్తివేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ త్వరలోనే ఈ నిర్ణయాన్ని నోటిఫై చేయనుందని ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశం అనంతరం ఆమె చెప్పారు.

అయితే ఇది అందరికీ వర్తించదు. దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. రూ.50 కోట్లకు పైన టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ కచ్చితంగా ఈ ఫెసిలిటీని వర్తింపజేయాల్సి ఉంటుంది. ఈ వ్యాపార సంస్థల నుంచి రూపే డెబిట్ కార్డు, యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్ ఫీజును వసూలు చేయకూడదు. కాగా ఇకపోతే నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్‌లోనే రూ.50 లక్షలకు పైన వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థలపై ట్రాన్సాక్షన్ల భారం తగ్గిస్తామని ప్రకటించారు. ఇప్పుడు అందుకు అనుగుణంగా నిర్ణయం వెలువడింది.

Read more RELATED
Recommended to you

Latest news