నా సక్సెస్ కు కారణం ఆమె అంటూ ఎమోషనల్ అయిన దిల్ రాజు..!!

-

ఏ రంగంలో అయినా సరే ఒక వ్యక్తి మంచి విజయ పతంతో దూసుకుపోతున్నారు అంటే కచ్చితంగా వారి వెనుక ఎవరో ఒకరి హస్తం ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాతలలో ఒకరైన దిల్రాజు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న చిన్న సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసిన ఈయన ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకు నిర్మాతగా వ్యవహరించే బాధ్యతలు చేపట్టడం గమనార్హం. ఇక అందుకే ఆయనకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దిల్ రాజు సినిమాలో ఏదైనా సినిమా తెరకెక్కుతోంది అంటే కచ్చితంగా హిట్ అవుతుందనే భావన చాలామందిలో ఉంటుంది.

ఇక ఈ క్రమంలోనే దిల్ రాజు నిర్మించిన థాంక్యూ సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. కాబట్టి.. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుపుకుంటున్నారు. అంతేకాదు ఇటీవల థాంక్యూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా వైజాగ్ తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని తెలిపిన ఆయన.. థాంక్యూ మూవీ గురించి మాట్లాడుతూ రవి ఐడియా గా చెప్పిన సమయంలో ఆ ఐడియా నాకు ఎంతగానో నచ్చింది. ఇక ఈ పాయింట్ ను మలచాలని అనుకుంటే మంచి ప్రయాణం కావాలని నేను భావించానని దిల్ రాజు వెల్లడించారు.

ఇకపోతే నేను జీవితంలో అన్నీ చూసి వచ్చాను. ఇక నేను ఇంత దూరం వచ్చి ఇంత సక్సెస్ అయ్యాను అంటే అది నా ఒక్కడి వల్లే కాదు. ఎంతోమంది సపోర్టు చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు. ముందుగా అమ్మానాన్నలకు థాంక్స్ ..మంచి చెడులు చెప్పి నన్ను మంచి వ్యక్తిగా తీర్చిదిద్దారు. ఇక తర్వాత నా భార్య అనిత 27 సంవత్సరాల ప్రయాణంలో అండగా నిలబడింది.. ముఖ్యంగా ఆమె సహకారం వల్లే ఇంత స్థాయికి వచ్చాను అంటూ దిల్ రాజు భార్యను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news