దిక్కు తోచని పరిస్థితిలో అనిల్ రావిపూడి..!!

-

ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3 హిట్ కొట్టినా చాలా రోజుల నుండి ఖాళీగా ఉన్నాడు. తన సినిమా కు స్క్రిప్ట్ వర్క్ మొత్తం తానే చూసుకొనే అనిల్ సినిమాను చాలా తొందరగా పూర్తి చేస్తాడు. అనిల్ రావిపూడి కు బాలయ్య ఎప్పుడో సినిమా కోసం మాట ఇచ్చాడు. గోపీచంద్ మలినేని సినిమా పూర్తి అయిన తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది.

ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయాల్సిన సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదట. ఇంకా “వీర సింహారెడ్డి” సినిమా షూటింగ్కు ఇంకొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.  అనిల్ రావిపూడి అంచనా  ప్రకారం  తన దర్శకత్వంలో చేయాల్సిన సినిమా షూటింగ్ నవంబర్ నెలలో స్టార్ట్ కావాలి.

కానీ “వీర సింహారెడ్డి” సినిమా, ఆహా షో తో బాగా బిజి గా వున్న బాలయ్య ను ఇంకో రెండు నెలల తర్వాత చూద్దాం అన్నారట. కాని అనిల్ రావిపూడి ముందే హీరోయిన్ శ్రీ లీల,ప్రియమణి డేట్స్ తీసుకొని షూటింగ్ ప్లాన్ చేసాడు.కాని ఇప్పుడు పరిస్థితి చూస్తే అనుకూలంగా లేకుండా పోయింది. అసలే గత సినిమా ఎఫ్ 3 సినిమా కోసం చాలా మంది నటీ నటులను తీసుకొని, షూటింగ్ డేట్స్ కుదరక, కొంత కరోనా వల్ల చాలా ఖర్చు పెరిగింది. దానితో దిల్ రాజు దాన్ని అంతర్గతంగా హిట్ గా అనుకోవడం లేదట. దీనితో మళ్లీ అదే పరిస్థితి ఈ సినిమాకు కూడా ఎదురు కావడంతో అనిల్ కు ఏమి చేయాలో పాలు పోవడం లేదట

Read more RELATED
Recommended to you

Exit mobile version