ఎవరెన్ని చేసినా.. గెలుపును అడ్డుకోలేకపోయారు : మంత్రి కేటీఆర్‌

-

మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేదానికి తెరపడింది. గత రెండు నెలలుగా మునుగోడు మేనియా తెలంగాణ హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే.. మునుగోడులో టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డిపై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయడమే కాకుండా.. ఆయన అనుచరుడు రూ.కోటితో మణికొండలో పట్టుబడింది నిజం కాదా? అని ప్రశ్నించారు. జమున హ్యాచరీస్‌కు రూ.25కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేసింది నిజం కాదా? ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా.. ఒక హవాలా ఆపరేటర్‌ మాదిరిగా వివేక్‌ను అడ్డం పెట్టుకున్నరు.. ఎందు కోసం ఈ కోట్ల రూపాయలు ఇస్తున్నారన్నారు మంత్రి కేటీఆర్‌.

కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా రూ.5.25కోట్లు మునుగోడులోని ఓటర్లు, బీజేపీ నేతలకు డైరెక్ట్‌గా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది నిజం కాదా? లిఖితపూర్వకంగా ఈసీకి ఫిర్యాదు చేస్తే.. ఎలక్షన్‌ కమీషన్‌పై ఒత్తిడి తెచ్చి.. ప్రేక్షపాత్ర వహించేలా చేసిన మాట వాస్తవం కాదా? మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఒకటీ రెండు కాదు.. అధికార దుర్వినియోగం, విచ్చలవిడి తినానికి పరాటకష్ట. 15 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ పోలీసులను దించారని, 45 ఐటీ టీమ్‌లను దించి ఏడు మండలాల్లో గ్రామీణ నియోజకవర్గ మీద దండయాత్ర వచ్చినట్టే వచ్చారన్నారు మంత్రి కేటీఆర్‌. టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బులు పంచారని, మేమం పట్టుకుంటామని 40 టీమ్‌లు వచ్చింది వాస్తవం కాదా? ఇంత పెద్ద ఎత్తున వందకోట్లు ఎలక్షన్‌ కమిషన్‌కు షికాయత్‌ చేస్తే ప్రేక్షకపాత్ర వహించింది నిజం కాదా అని ఆయన మండిపడ్డారు. ఇలా ఎన్ని చేసిన చివరకు టీఆర్‌ఎస్‌ గెలుపును అడ్డుకోలేకపోయారని, కొంత మెజారిటీని ప్రలోభ పెట్టి తగ్గించగలిగారు అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version