NTR30 మేకర్స్ పై విరుచుకుపడుతున్న జూఎన్టీఆర్ అభిమానులు..!!

-

ఆర్ఆర్ఆర్ సినిమాతో  దర్శక ధీరుడు రాజమౌళి మరోసారి తన దర్శక ప్రతిభతో తెలుగు సినిమా ను ప్రపంచ స్థాయిలో నిలిపాడు. ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల స్క్రీనింగ్ అయ్యి ఇతర దేశాల ప్రేక్షకులను అబ్బుర పరిచింది. ఈ సినిమా వల్ల రాజమౌళికి విపరీతంగా ప్రచారం వచ్చింది. రాజమౌళి, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్  జపాన్ విడుదల లో పాల్గొంటూ , అక్కడి మీడియాతో ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

రాజమౌళి వల్ల బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారి పోయాడు. కాని ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకు కూడా అలాంటి ఫాలోయింగ్ వస్తుందా, రాదా అనే చర్చ జరుగుతోంది. రామ్ చరణ్ ఆచార్య తో ప్లాప్ మూటగట్టుకున్నా వెంటనే శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు. శంకర్ అంటే ఫాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వుంటుంది కాబట్టి ఈ సినిమా పై అంచనాలు నెలకొన్నాయి.

మరో వైపు జూ ఎన్టీఆర్ కొరటాల శివ తో NTR 30 సినిమా చేస్తున్నాడు. చాలా రోజుల నుండి ఈ  సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇంకా సైట్స్ పైకి అడుగు పెట్టలేదు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియకుండా వుంది. దీనిపై జూ ఎన్టీఆర్ అభిమానులు పైకి చెప్పడంతో లేదుగానీ లోపల మాత్రం తమ హీరో సినిమా అప్డేట్ లేనందుకు నిరుస్థాహం గా వున్నారు. ఇక యువ సుధ ఆర్ట్స్ వాళ్ళు పుండు మీద కారం చల్లి నట్లు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో వున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది చూసి జూ ఎన్టీఆర్ అభిమానులు తొందరగా స్టార్ట్ చేయండ్రా బాబు, ఇంక ఎంత సేపు బాబు వంటి కామెంట్స్ తో విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version