ఇప్పుడు దేశంలో నంబర్ వన్ దర్శకుడిగా మన రాజమౌళి ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే. బహుబలి సినిమా లతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారుమళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేశారు రాజమౌళి. ఇప్పుడు తన తర్వాత సినిమా పై మనకంటే దేశంలో ఎక్కువుగా ఆసక్తి వుంది. అలాగే రీసెంట్ గా జపాన్ లో ఆర్ఆర్ఆర్ విడుదల చేస్తే సూపర్ గా వసూళ్లు సాధిస్తోంది.
ఇక రాజ మౌళి ని పోగడని హీరోలు, నిర్మాతలు, దర్శకులు లేకుండా పోయారు. సంజయ్ లీలా భన్సాలీ వంటి వారు కూడా రాజమౌళి ని ఆకాశానికి ఎత్తేశారు. హీరోల రాజ్యం నడుస్తున్న కాలంలో తమ దర్శకులకు పేరు తెచ్చిన వాడని కీర్తించారు.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న జక్కన్న తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ కాంతార పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారీ హిట్ అందుకోవాలంటే లు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదని కాంతార లాంటి చిన్న బడ్జెట్ సినిమాలు కూడా బడ్జెట్ కంటే పది రెట్లు వసూలు చేశాయి అని అన్నారు.
అలాగే సినిమాకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ను వాడుకొని మీడియానే మన వెంట పడేలా చేసుకోవచ్చు అని అన్నారు. అలాగే ప్రతి సినిమాకు కంటెంట్ ముఖ్యం.. ప్రచారం కాదు. ప్రచారం మొదటి రోజు మొదటి ఆట కు మాత్రమే ఉపయోగం. కంటెంట్ అనేది ప్రేక్షకులకు ఉత్సాహాన్ని కలిగించాలి. ఈ విషయాన్ని చిత్రనిర్మాతలుగా.. దర్శకులుగా మనం ఏమి తీస్తున్నాం ఎలా తీస్తున్నాం అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అని అన్నారు.