మంత్రి తలసాని తో డైరెక్టర్ రాజమౌళి భేటీ

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో… టాలీవుడ్ చిత్ర ప్రముఖులు భేటీ అయ్యారు. టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, దిల్ రాజు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటీ అయిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పెను సవాళ్లను.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు. సినిమారంగ సమస్యలు, టిక్కెట్ ధరల పెంపు, కరోనా మూడో దశ నేపథ్యంలో మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం, షూటింగులు వంటి అంశాలపై తలసానితో చర్చిస్తున్నారు సినీ ప్రముఖులు.