తమిళ ఇండస్ట్రీ ఇప్పుడు ఓ తెలుగమ్మాయి గురించే మాట్లాడుకుంటోంది. ఆల్రెడీ తమిళ తంబీలకు ఆవిడ సుపరిచితురాలే. ఈనెల 12 నుంచి ఆమెను ఎక్కువగా తలుస్తారు. ప్రేక్షకులే కాదు. స్టార్ హీరోలు.. యంగ్ హీరోలు సైతం ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళంలో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న ఆ తెలుగమ్మాయి సుధ కొంగర.
గుంటూరు జిల్లా తుళ్లూరులో పుట్టిన సుధ కొంగర మద్రాస్‌లో మాస్ కమ్యూనికేషన్ చేసింది. ‘ఇరుద్ది సుత్రు’ అనే తమిళ చిత్రంతో దర్శకురాలిగా మారగా.. ఇదే సినిమాను తెలుగులో గురు పేరుతో వెంకటేశ్‌తో రీమేక్ చేస్తే.. ఇక్కడా సక్సెస్ అయింది. గురు తర్వాత కనిపించని ఈ దర్శకురాలు.. రెండేళ్లుగా.. ‘ఆకాశమే నీ హద్దురా’ మూవీ కోసం సూర్యాతో ట్రావెల్ చేసింది. ఎయిర్ దక్కన్ అధినేత గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం దీపావళికి ఓటీటీలో రిలీజై… విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
ఈక్రమంలో… సూర్య యాక్టింగ్‌కు ముఖ్యంగా దర్శకురాలు టేకింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. దీంతో.. డైరెక్టర్‌గా క్రేజ్ ఇమేజ్ దక్కించుకుంది సుధ కొంగర. ఆకాశమే నీ హద్దురాకు వచ్చిన రెస్పాన్స్‌తో సుధ కొంగరకు అభినందనలు వెల్లువెత్తాయి. స్టార్ హీరోలు సైతం తమ డైరెక్టర్‌గా సుధ పేరు పరిశీలిస్తున్నారు. విజయ్ అయితే.. కథ రెడీ చేయమన్నాడట. అలాగే.. మరో తమిళ స్టార్ అజిత్ సుధాతో వర్క్ చేస్తాడన్న టాక్ కూడా నడుస్తోంది. టైటిల్‌కు తగ్గట్టు.. ఆమెకొచ్చిన క్రేజ్ ఆకాశమే హద్దుగా మారింది.
సుధా కొంగరలో హీరోలు లేడీ జక్కన్నను చూసుకుంటారు. రాజమౌళి హీరోలను కష్టపెట్టి ఔట్‌పుట్ లాగినట్టే.. సధా కొంగర కూడా.. హీరోలతో వర్కవుట్స్ చేయిస్తుంది. గురు సినిమాలో వెంకటేశ్ బాక్సింగ్ కోచ్‌గా కనిపించాడు. దీనికి తగ్గట్టు బాడీ వుండాలని సుధ కోరడంతో.. వెంకటేశ్ 6 నెలలపాటు వర్కవుట్స్ చేసి మేకోవర్ అయ్యాడు. అలాగే గుబురు గడ్డంతో వెంకీ లుక్ కూడా మర్చేసింది. ఇక సూర్య అయితే.. ఆకాశం నీ హద్దురాలో పోషించిన క్యారెక్టర్ ఒకటే అయినా.. మూడు రకాల షేడ్స్ కోసం.. బాడీలో.. లుక్‌లో మార్పులు చేసింది. మేకింగ్ వీడియో చూస్తే.. సూర్యా ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. ఈ మహిళా దర్శకురాలు చేతిలో పడితే.. ఒళ్లు హూనం అవ్వాల్సిందే. ఫలితం కూడా దానికి తగ్గట్టే వుంటుంది.