మామూలుగా మనం నీళ్ళని మరిగించుకోవడానికి వాటర్ హీటర్ ని ఉపయోగిస్తుంటాం. వాటర్ హీటర్ ని ఉపయోగించడం వల్ల సులువు గానే నీళ్లు వేడెక్కి పోతాయి. వింటర్ సీజన్ లో సాధారణంగా చాలా మంది దీనిని ఉపయోగిస్తూనే ఉంటారు. బకెట్ లో నీళ్ళు ఫిల్ చేసి వాటర్ హీటర్ పెట్టేస్తే నీళ్లు క్షణాల్లో మరిగి పోతాయి. చాలా సులువుగా ఉంది కదా ఈ పద్దతి అని దీనినే అనుసరించడం జరుగుతుంది. అందునా తక్కువ ధరలో వచ్చేస్తుంది కాబట్టి మధ్యతరగతి ప్రజలు వీటివైపునకు మొగ్గు చూపుతూ ఉంటారు. ఈ హీటర్ల వాడకం వల్ల కరెంట్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. వాటర్ హీటర్ వాడుతున్నారా?? అయితే జాగ్రత్తగా ఉండండి.
వాటర్ హీటర్‌లో ఆటో ఆఫ్ మెకానిజం ఉండదు. నీళ్లు వేడెక్కాయా లేదా అని తెలుసుకోవడం కోసం చేతిని నీటిలో ఉంచి చూస్తూ ఉంటారు అలా చెయ్యకూడదు. ఒకవేళ స్విచ్ ఆఫ్ చెయ్యడం మరచిపోయి ఉంటే పరిస్థితి ఊహలకు అందనిది. ఇటీవలే ఇలాగే చెయబోయి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంకా వాటర్ హీటర్ వాడకం వల్ల విద్యుత్ షాక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంత సురక్షితం కాదు. సో వాటర్ హీటర్‌లను వాడకం మానేసి, గ్యాస్ స్టవ్ పైన కానీ లేదా గీజర్ కానీ వాడటం ఉత్తమం..
ఒక వేళ వాటర్ హీటర్ వాడుతూ ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- పిల్లలకు దూరంగా ఉండేలా చూసుకోవడం ఉత్తమం.
- వాటర్ హీటర్ వాడటానికి ముందు స్విచ్ ఆఫ్ లో ఉందా లేదా చూసుకోవాలి.
- మెటల్ బకెట్లు విద్యుత్ షాక్లకు కారణమవుతాయి కాబట్టి మెటల్ బకెట్లను వాడకపోవడం మంచిది.
- హీటర్ యొక్క పిడి పొడిగా తేమ లేకుండా చూసుకోవాలి.
కొంచెం డబ్బులు పెడితే గీజర్ వచ్చేస్తుంది. కానీ డబ్బులు వేస్ట్ గీజర్ కి అని వాటర్ హీటర్ వాడితే ఏకంగా ప్రాణాలకే ప్రమాదం కలిగింది. ఇది ఏదో కధ కాదు. నిజంగా ఇది ఒక ఇంట్లో జరిగినది. వాళ్లు కూడా అందరి లానే వాటర్ హీటర్ తో నీళ్లు మరిగించుకుంటున్నారు. కానీ అనుకోకుండా మృత్యువు ఈ రూపం లో వచ్చింది. ఇప్పటి కాలం లో వాటర్ ని హీట్ చెయ్యడానికి ఇటువంటి హీటర్స్ చాలానే ఉన్నాయి. మీరు కూడా వాటిని ఉపయోగిస్తున్నటైతే తస్మాత్ జాగ్రత్త…!