చాలా మంది గర్భిణీలకు ఈ సందేహం ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు పూజలు చెయ్యొచ్చా..? చెయ్యకూడదా…? అలానే ఒకవేళ చెయ్యచ్చు అంటే ఎన్ని నెలల వాళ్ళు చెయ్యాలి. ఇలా అనేక సందేహాలు ఉంటాయి. అయితే మరి ఈ విషయం పై పూర్తి సమాచారం ఇక్కడ ఉంది. మరి ఇప్పుడే మీకు ఉన్న సందేహాల్ని క్లియర్ చేసేసుకోండి.
హిందూ సంప్రదాయం లో పూజలు ఎక్కువగా ఉంటాయి. అయితే నిత్యం అలవాటైన ఈ పూజల్ని కడుపు తో ఉన్న వాళ్ళు చెయ్యకూడదని అంటూ ఉంటారు. ఎందుకు చెయ్యకూడదు అంటే… కొంత మంది చెబుతున్న ప్రకారం గర్భవతిగా ఉన్నప్పుడు తేలిక పాటి పూజలు చేయ వచ్చని, అలాగే కొబ్బరి కాయ మాత్రం కొట్టకూడదని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయకూడదు అని చెప్పడం జరిగింది.
ఇక పోతే పలు పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్లకూడదని శాస్త్రాల లో చెప్పబడి ఉన్నది. కనుక గర్భవతులకి పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి లేదని కొంత మంది పూజారులు చెబుతుంటారు. కనుక గర్బీణీలు ఈ పద్ధతులని అనుసరించడం మేలు ఎందుకంటే మీ క్షేమం అన్నింటి కంటే కూడా ముఖ్యం. అందుకే ఈ పద్దతిని అనుసరించండి.