తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. అనేక రకాల కార్యక్రమాలను తీసుకువచ్చి ప్రజలు ఆర్టీసీ ఆదరించే లా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆర్టీసీ… తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తెలంగాణ నిరుద్యోగ యువతకు బస్సులపై ఆర్టీసీ డిస్కౌంట్ ను ప్రకటించింది.
నిరుద్యోగ యువతకు చేయూత అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది ఆర్టీసీ. సిటీ ఆర్డినరీ అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ ల పై 20% డిస్కౌంట్ అందించనున్నట్లు గా స్పష్టం చేసింది తెలంగాణ ఆర్టీసీ. ఈ రెండు రకాల బస్సు పాసులు నగరంలోని అన్ని బస్ పాస్ కౌంటర్లలో పొందవచ్చునని తెలిపింది బస్ పాస్ పొందడానికి దరఖాస్తుకు సంతకం చేసిన ఆధార్ కార్డు తో పాటుగా కోచింగ్ సెంటర్ ఐడీ కార్డు జిరాక్స్ జత చేయాల్సి ఉంటుంది. ఆర్డినరీ బస్సు పాస్ మూడు నెలలకు 20 శాతం డిస్కౌంట్ తో ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది.
TSRTC is happy to announce 2 new bus passes for the unemployed youth attending training classes for competitive exams in #Telangana with a discount of 20%. #TSRTC wishes you all the very best and bright future ahead @TSRTCHQ @baraju_SuperHit @TV9Telugu @sakshinews#TSRTCNewPass pic.twitter.com/DQUfiRmlpl
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) April 30, 2022