దిశ ఎన్ కౌంటర్ కేస్… సిర్పూర్కర్ కమిషన్ కు వ్యతిరేఖంగా ప్రజల నినాదాలు..

-

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దిశ అత్యాచారం కేసు సంచలనం రేపింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలిపారు. నిందితులను ఖఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేస్ రికన్స్ స్ట్రక్షన్ వేల పోలీసులపై నలుగురు నిందితులు దాడి చేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు ప్రతిదాడి చేయడంలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో వారు హతమయ్యారు. ఈ ఘటనపై సుప్రీం కోర్ట్ సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఇప్పటికే అప్పటి సీపీ సజ్జనార్ తో పాటు పలువురు అధికారులను విచారించింది.

తాజా దిశ నిందితుల ఎన్ కౌంటర్ స్థలానికి క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సిర్పూర్కర్ కమిషన్ వెళ్లింది. దిశ డెడ్ బాడీని కాల్చిన ప్రదేశాన్ని కూడా పరిశీలించింది ఈ సమయంలో స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. స్థానికులు కమిషన్ కు వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. కమిషన్ గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు. దుర్మార్గులను ఎన్ కౌంటర్ చేస్తే తప్పేంటి అని స్థానికులు ప్రశ్నించారు. కమిషన్ నెగిటివ్ రిపోర్ట్ మహిళల భద్రతకు ఏం సందేశం ఇస్తుందో చెప్పాలన్నారు. పోలీసులకు వ్యతిరేఖంగా ఇచ్చే రిపోర్టు వల్ల దిశ నిందితుల్లాంటి వ్యక్తులు సమాజంలో వందల మంది తయారవుతారని ప్రజలు ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version