దేశంలో పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెల్సిందే. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలు ఎడ్లబండ్ల మీద నిరసనలు తెలిపారు.

అయితే మెదక్‌లో కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రమాదవశాత్తు ఎడ్ల బండి పైనుంచి జారి కిందపడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు ఆయన్ను పక్కకు లాగారు. రాజనర్సింహ ప్రసంగిస్తున్న సమయంలో ఎద్దులు బెదరడంతో అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో రాజనర్సింహ మోకాలికి స్వల్ప గాయం కాగా వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.
Former Dy CM of United #AndhraPradesh Damodar Raja Narasimha injured after fall from a bullock cart during #FuelPriceHike protest organised by #Congress party in Medak of #Telangana pic.twitter.com/MmQ9jantc8
— Aashish (@Ashi_IndiaToday) July 12, 2021