కొత్త జంటల పై కూడా కరోనా ప్రభావం..ఒకే ఆఫీస్ లో ఏకంగా!!

-

ఎక్కడ విన్నా, చూసినా కరోనా ప్రభావం బాగా కనిపిస్తుంది. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారి ప్రభావం కొత్త జంటల కు కూడా విలన్ గా మారింది. కరోనా కు కొత్త జంటలకు మధ్య ఉన్న లింక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా. నిజంగానే ఈ కరోనా మహమ్మారి కారణంగా చైనా లోని కొత్తగా పెళ్ళైన జంటల మధ్య చిచ్చు రేపుతోంది. ఈ కరోనా కారణంగా ఒకే ఆఫీస్ లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 జంటలు విడాకులకు అప్లై చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి చూసుకుంటే చైనా లోని ఒక ఆఫీస్ లో పని చేస్తున్న 300 జంటలు విడాకులకు అప్లై చేసుకున్నట్లు తెలుస్తుంది. కరోనా కారణంగా అన్ని దేశాలూ హై-అలెర్ట్ పాటిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్కూళ్లు, విద్యాసంస్థలు, ఆఫీసులు.. ఇలా ఒకటేమిటి అన్నింటినీ బంద్ చేసి జనాలను గృహ నిర్బంధం చేశారు. దీనితో కొత్తగా పెళ్ళైన జంటలు ఇళ్ల దగ్గర ఎక్కువగా సమయం గడుపుతున్నారు. అలాగే ఏదొక సందర్భంలో గొడవలకు దిగుతుండడం తో వారంతా విడాకులకు అప్లై చేసుకున్నట్లు సమాచారం.

మునపటి కంటే విడాకులు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని సమాచారం. యువ జంటలు ఎక్కువసేపు ఇళ్ల దగ్గర గడుపుతున్న నేపథ్యంలో ఇరువురి మధ్య గొడవలు జరగడం, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం వల్లే వాళ్ల వ్యవహారం విడాకుల వరకు వెళ్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి కరోనా ప్రభావం తో భార్య,భర్తలు విడాకుల వరకు వెళ్లాల్సి వస్తుందట. కాగా, చైనాలోని వుహాన్‌లో మొదలైన కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం 156 దేశాలకు విస్తరించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి సుమారు 6000 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version