దీపావళి ఎఫెక్ట్.. టపాసుల స్టాల్స్‌ ఏర్పాటులో అక్రమ వసూళ్లు!

-

దీపావళి పండుగను పురస్కరించుకుని 2 రోజుల పాటు నిర్వహించే బాణసంచా షాపుల కేటాయింపులో వివిధ శాఖల అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. టపాసుల స్టాల్స్ ఏర్పాటుకు వివిధ ప్రభుత్వ శాఖల అనుమతులు పొందేందుకు నిర్వాహకులు నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించే చలానాతో పాటు అదనంగా మామూళ్లు అందించాల్సిన పరిస్థితి నెలకొన్నదని స్టాల్స్ నిర్వాహకులు వాపోతున్నారు.

షాపుల ఏర్పాటుకు సంబంధించి ఎమ్మార్వో, ఫైర్, ఆర్డీఓ, పోలీసు శాఖల నుంచి అనుమతి తప్పనిసరి కావడంతో ఉన్నతాధికారుల నుంచి చిన్న స్థాయి అధికారులు సైతం అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏపీలోని స్టాల్స్ నిర్వాహకులు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ చలానాతో పాటు అదనంగా ఒక్కో షాపునకు రూ.3 వేల నుంచి రూ.4 వేలు చెల్లించాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. అన్నవరం దేవస్థానం జూనియర్ కాలేజీ లేదా సంస్కృత ఉన్నత పాఠశాల ఆవరణలో స్టాల్స్ ఏర్పాటు కోసం ఒక్కో షాపునకు రూ.12 వేలను దేవస్థానం చలానా రూపంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news