ఏపీలోని గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పాఠశాల వసతి గృహంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. తోటి విద్యార్థిని మరణంతో పలువురు విద్యార్థిని భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే అక్కడకు చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జీజీహెచ్‌కు తరలించారు.
కాగా, విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కూతురి మృతి గురించి తెలియడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తమ కూతురి మరణానికి పాఠశాల యాజమాన్యమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.