తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు : డీకే అరుణ

-

అసెంబ్లీ ఎన్నికలకు దూరం ఉంటున్నట్లు మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ బుధవారం ప్రకటించారు. తాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. తన గద్వాల నియోజకవర్గంలో బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తామని చెప్పారు. తమ పార్టీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు సాగుతున్నామని, అందుకే తన స్థానంలో బీసీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గద్వాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. తాను తమ పార్టీ అభ్యర్థుల తరఫున తెలంగాణవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తానన్నారు. కాగా, ఇప్పటికే కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ పోటీకి దూరంగా ఉన్నారు.

గద్వాల అసెంబ్లీ స్థానంనుండి కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్ధిగా ఆమె పలు దఫాలు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ దఫా మాత్రం పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దఫా అధికారం దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version