డబ్బు మదంతో విర్రవీగే వారికి బుద్ధి చెప్పాలి : కేసీఆర్

-

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ తెలంగాణలో దళారీ రాజ్యమే వస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ధరణి తీసివేస్తమని రాహుల్‌ గాంధీకి కూడా మాట్లాడుతున్నడు. రాహుల్‌ గాంధీకి ఎద్దు ఎరుకనా.. ఎవుసరం ఎరుకనా? ఎన్నడన్న నాగలి పట్టిండా? రైతుల బాధలు తెలుసా? ఇక్కడ ఎవడో సన్నాసి రాసిస్తే తెల్వక అజ్ఞానంతో మాట్లాడుతున్నడు.

ధరణి బంద్‌ అయితే.. దానికి ప్రత్యామ్నాయం ఏం వస్తుంది? మళ్లీ వీఆర్వోలేనా ? మళ్లీ పహాణీ నకల్లేనా? మళ్లీ ఎమ్మార్వో కార్యాలయం.. వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుడేనా? అన్న నా పేరు ఎక్కియ్యంటే.. మళ్లీ లావ్‌ పాంచ్‌ హజార్‌ అంటారు. మళ్లీ అదే రావాలా? మీ అధికారం ఉండాలా? మీ అధికారాన్ని తీసివేసుకుంటారా..? అంటూ ప్రశ్నించారు. డబ్బు మదంతో విర్రవీగే వారికి బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version