డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు సంచలన కామెంట్స్ చేసారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో బ్లాస్టింగ్ వల్ల కల్వకుర్తి పంప్ హౌస్ లో మోటార్లు నీట మునిగాయన్న ఆమె మోటార్లు బ్లాస్ట్ అయి నీటిలో మునిగి పోవడం 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందకుండా పోతుందని అన్నారు. అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ వద్దని ఉమ్మడి మహుబూబ్ నగర్ నాయకులు లేఖ రాసారని, లేఖ రాసిన వారిలో ప్రస్తుత టి ఆర్ ఎస్ మంత్రులు,ఎమ్మెల్యే లు కూడా ఉన్నారని ఆమె అన్నారు.
అయినా అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కె ప్రభుత్వం మొగ్గుచూపింద ని కానీ ఎమ్మెల్యే లు,మంత్రులు రాజీనామా చేయకుండా కేసీఆర్ బూట్లు నాకుతున్నారని ఆమె అనుచిత కామెంట్స్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ టి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులకు సిగ్గు లేదా…చీము రక్తం లేదా ? అని ఆమె ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైన ప్రభుత్వం వివక్ష చూపిస్తుందన్న ఆమె ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రోజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కరెక్ట్ కాదని ఇంజనీర్ల బృందం తిరస్కరించినా ప్రభుత్వం దానికే మొగ్గు చూపిందని అన్నారు.