అసెంబ్లీ సెక్రటరీకి డీకే అరుణ లేఖ.. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలి

-

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి  అనర్హుడని ప్రకటిస్తూ.. డీ.కే.అరుణ ఎమ్మెల్యేగా హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా డీకే అరుణ అసెంబ్లీకి వెళ్లారు. స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శిని కలిసి లేక సమర్పించాలనుకున్నారు. కానీ స్పీకర్ అందుబాటులో లేరు. స్పీకర్ కార్యాలయంలో లేఖను అందజేసి.. అనంతరం అసెంబ్లీ కార్యదర్శ కలిసి ఎన్నికల సంఘం జారీచేసిన కాపీని ఇచ్చారు. ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడారు.

తనను ఎమ్మెల్యేగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని వివరించారు d. K. అరుణ. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని.. తెలంగాణ గెజిట్ నోటిఫికేషన్ లో వెంటనే నా పేరును పబ్లిష్ చేయాలని చెప్పిందని పేర్కొన్నారు. అసెంబ్లీ స్పీకర్ సెక్రెటరీ రిప్రజెంటేషన్ ఇచ్చామని స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో వారి కార్యాలయంలో లెటర్ ఇచ్చినట్టు తెలిపారు. స్పీకర్ కాల్లో కూడా అవైలబుల్ గా లేరని కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ అసెంబ్లీ సెక్రెటరీ ఆదేశాలు ఇచ్చారన్నారు.

వీలైనంత తొందరగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని డీకే అరుణ కోరారు. ఇప్పటికే లేట్ అయిందని వెంటనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నట్టు తెలిపారు. సుప్రీంకోర్టులో కృష్ణమోహన్ రెడ్డి వేసిన పిటిషన్ పై డీకే అరుణ మాట్లాడుతూ కోర్టులో మా లాయర్లు చూసుకుంటారు. హైకోర్టును నిర్లక్ష్యంగా చూశారు. ఇక్కడ ఎప్పుడు కౌంటర్ వేయకుండా సుప్రీంకోర్టుకి వెళ్లారు. ఉద్దేశపూర్వకంగా కేసును తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు అని 2019 డిసెంబర్లో పిటిషన్ వేశాను అప్పటినుంచి ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు. హైకోర్టుని ఆశ్రయించకుండా ఇప్పుడెదుకు సుప్రీంకోర్టుకు వెళ్లారని తెలిపారు డీకే అరుణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version