న్యాయం చేస్తానని నమ్మించి యువతిని గర్భవతిని చేశారు ఓ కానిస్టేబుల్. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. డబ్బుల విషయంలో కొందరు ఇబ్బంది పెడుతున్నారని.. గతేడాది మార్చి 21న మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది ఓ యువతి. అయితే..ఈ కేసు విషయమై మాట్లాడుదామని ఇంటికి పిలిపించుకుని.. తనకి పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేశాడు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి.
ఇక యువతి గర్భం దాల్చగా.. బలవంతంగా అబార్షన్ చేయించారు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి. యువతి అడ్డు తొలగించాలనుకునే క్రమంలో పలుమార్లు ఆమెపై దాడి చేశాడట కానిస్టేబుల్. అయితే.. కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి టార్చర్ భరించ లేక… ఈ నెల 3న కమిషనరేట్‌లో యువతి ఫిర్యాదు చేసిందని సమాచారం. దీంతో కేసు నమోదు చేసి సుధాకర్ రెడ్డిని రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతిని గర్భవతిని చేసిన కానిస్టేబుల్.
డబ్బుల విషయంలో ఆమెను కొందరు ఇబ్బంది పెడుతున్నారని గత ఏడాది మార్చి 21న మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతికి, న్యాయం చేస్తానని నమ్మించి గర్భవతిని చేసిన కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి.
కేసు విషయమై ఫోన్ చేసిన యువతిని… pic.twitter.com/rixhrYjVok
— Telugu Scribe (@TeluguScribe) February 7, 2025