మళ్ళీ డీకే శివకుమార్ అరెస్ట్ అయ్యే ఛాన్స్.. 74.93 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు ?

-

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల పై డీకే శివకుమార్ కి సిబిఐ నోటీసులు జారీ చేయనున్నట్టు చెబుతున్నారు. అక్రమ ఆస్తులపై విచారణకు హాజరు కాచాల్సిందిగా ఈ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. డీకే ఆస్తులపై సిబిఐ సమగ్ర విచారణ చేయనున్నట్టు చెబుతున్నారు. నిన్న ఏకకాలంలో డీకే శివకుమార్, ఆయన సోదరుడి ఇళ్ళ మీద ఏకకాలంలో దాడి చేసిన సీబీఐ ఆ దాడుల్లో 74.93 కోట్లను గుర్తించినట్టు చెబుతున్నారు.

ఆస్తి, బ్యాంకులకు సంపాందించిన పత్రాలతో పాటు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లని కూడా సీబీఐ స్వాధీనం చేసుకుందని అంటున్నారు. గతంలో కూడా ఈయన మీద ఈడీ పీఎం ఎల్ ఏ కింద కేసు నమోదు చేసింది. 2017లో ఏమో ఐటి శాఖ కేసు నమోదు చేసింది. అప్పట్లో ఢిల్లీ లో డీకే నివాసం లో రూ.8.83 కోట్ల నగదు ను గుర్తించింది ఐటి శాఖ. ఇప్పటికే ఐటి, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న శివకుమార్ మీద తాజాగా సీబీఐ కేసుల నమోదు కావడంతో ఆందోళనలో డీకే కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు మునిగిపోయాయి. అయితే రానున్న ఉప ఎన్నికలకు ఆయన బయట ఉంటే గెలవలేమని భావించి బీజేపీ సర్కార్ ఇలాంటి పనులు చేస్తిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఆయన్ని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news