కోవిడ్ 19 రూల్స్ బ్రేక్ చేయ‌కండి.. ఐపీఎల్ ప్లేయ‌ర్ల‌కు బీసీసీఐ హెచ్చ‌రిక‌..

-

యూఏఈలో సెప్టెంబ‌ర్ 19 నుంచి నవంబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ 13వ ఎడిష‌న్ కోసం ఇప్ప‌టికే టీంలు అక్క‌డికి వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాయి. కింగ్స్ ఎలెవ‌న్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు, సిబ్బంది ఇప్ప‌టికే ప్ర‌త్యేక విమానాల్లో దుబాయ్‌కి చేరుకున్నారు. అయితే టోర్నీ సంద‌ర్భంగా బీసీసీఐ ప్లేయ‌ర్ల‌కు, ఐపీఎల్ ఫ్రాంచైజీల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

కోవిడ్ 19 రూల్స్ ను ఫ్రాంచైజీలు, ప్లేయ‌ర్లు బ్రేక్ చేయ‌కూడ‌ద‌ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి హెచ్చ‌రించారు. దుబాయ్‌లో క‌రోనా కేసుల సంఖ్య త‌క్కువ‌గా ఉంద‌ని చెప్పి ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ప్లేయ‌ర్లు, సిబ్బంది తిర‌గ‌కూడ‌ద‌ని, క‌చ్చిత‌మైన నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని అన్నారు. బ‌యో సెక్యూర్ బ‌బుల్‌ను వీడితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ప్లేయ‌ర్లు, కోచింగ్ సిబ్బంది, ఓనర్లు, ఇత‌ర సిబ్బంది క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అన్నారు.

కాగా ఇటీవల ఇంగ్లండ్‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ఓ టెస్టు సిరీస్ సంద‌ర్భంగా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ బ‌యో సెక్యూర్ బ‌బుల్ రూల్‌ను బ్రేక్ చేశాడు. దీంతో అత‌న్ని త‌రువాత టెస్టు నుంచి తప్పించారు. అందువ‌ల్ల ప్లేయ‌ర్లు, సిబ్బంది జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. కేవ‌లం ఒక్క‌రు బ‌య‌ట‌కు వెళ్లి తిరిగి వ‌చ్చినా అది ఆ టీం మొత్తానికీ ఇబ్బందిక‌రంగా మారే అవ‌కాశం ఉంటుంద‌ని, క‌నుక అంద‌రూ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని బీసీసీఐ సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version