తెలుగు మీడియా రంగంలో మీడియా సంస్థల మధ్య యుద్ధం అప్పుడెప్పుడో ఈనాడు వర్సెస్ ఉదయం నుంచి ఉన్నదే. ఇక సాక్షి వచ్చాక వరుసగా మీడియా సంస్థలు, ఛానెల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకు రావడంతో మీడియా సంస్థల మధ్య ఆధిపత్య యుద్దం ఎక్కువ అవుతూ వచ్చింది. ఇక సాక్షి వచ్చాక సాక్షి వర్సెస్ ఈనాడు, సాక్షి వర్సెస్ ఆంధ్రజ్యోతి వార్ కొనసాగింది. ఇక సూర్యపై ఆంధ్రజ్యోతి టార్గెట్‌డ్ కథనాలతో విరుచుకు పడుతోంది. సూర్య పుట్టిక ఎలా వచ్చిందో కూడా… ఆ పత్రిక పుట్టుకే అవినీతి మయం అంటూ అప్పట్లో ఆంధ్రజ్యోతి వరుస కథనాలు కొనసాగించి పెద్ద సంచలనానికి కారణమైంది.
తాజాగా మీడియాలో రెండు ఛానెల్స్ మధ్య పెద్ద యుద్ధానికి తెరలేచింది. ఆ రెండు ఛానెల్సే టీవీ 5, ఎన్టీవీ. మరి ఈ రెండు ఛానెల్స్ మధ్య ఎక్కడ తేడా కొట్టిందో కాని.. ఎన్టీవీ, టీవీ 5ను టార్గెట్‌గా చేసుకుని వరుస కథనాలతో విరుచుకు పడేందుకు రెడీ అవుతున్నట్టు ఆ ఛానెల్ వేస్తోన్న ప్రోమోలే చెపుతున్నాయి. టీవీ 5 అధినేత నాయుడు అవినీతి అనడంతో పాటు ఆ ఛానెల్ యాజమాన్యం తయారు చేసే మోకాలి నొప్పుల బామ్ కూడా పెద్ద బోగస్ అంటూ ప్రోమోలోనే చెప్పింది. దీనిని బట్టి ఎన్టీవీ టీవీ 5ను గట్టిగానే టార్గెట్‌గా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రోమోగోలోనే ఎన్టీవీ రియల్ దందాలు కూడా ప్రస్తావించింది.
వాస్తవంగా చూస్తే ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి, టీవీ అధినేత నాయుడు కమ్మ వర్గానికే చెందిన వారు. మరి వీరి మధ్య ఎక్కడ తేడా కొట్టిందో కాని ఇప్పుడు యుద్ధానికి తెరలేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ విషయంలో రెండు ఛానెల్స్ ఇక్కడ కేసీఆర్‌కు అనుకూలంగానే వెళుతున్నాయి. ఏపీలో మాత్రం ఎన్టీవీ ప్రభుత్వం స్టాండ్‌తో వెళుతున్నట్టు కనిపిస్తుంటే.. టీవీ 5 మాత్రం పూర్తిగా అమరావతి స్టాండ్ తీసుకుని.. టీడీపీ ఫేవర్‌గా వెళుతోంది. మరి ప్రోమోలతో ఎన్టీవీ టీవీ 5 భరతం పట్టేందుకు రెడీ అవుతుంటే… టీవీ 5 కూడా ఎన్టీవీపై కౌంటర్ కథనాలు ప్లాన్ చేస్తోందట.