ఈ విషయాల్లో అస్సలు సిగ్గు పడొద్దు.. లేదంటే జీవితమే నాశనం అయిపోతుంది..!

-

ప్రతి ఒక్కరు లైఫ్ లో ఎదగాలని అనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలని అనుకుంటారు. ప్రతి మనిషికి కూడా ఏదో ఒక గోల్ ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో సిగ్గు పడకూడదు. కొన్ని విషయాలలో సిగ్గుపడితే మంచిదే కానీ కొన్ని విషయాల్లో అసలు సిగ్గు పడకూడదు. ఇలాంటి విషయాల్లో సిగ్గుపడ్డారంటే జీవితం పాడైపోతుంది. డబ్బు విషయంలో అసలు సిగ్గు పడొద్దు. ఎందుకంటే డబ్బును గౌరవిస్తేనే మన దగ్గర అది ఉంటుంది. లేదంటే అప్పులు పాలైపోతూ ఉంటాము. చాణక్య ఒక వ్యక్తి డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఎప్పుడూ సిగ్గు పడకూడదని… ఎవరైనా మీ దగ్గర అప్పు తీసుకుంటే తిరిగి అడగడానికి వెనుకడుగు వేయద్దని చెప్పారు.

అలాగే డబ్బు అవసరమైతే ఎవరినైనా అడగడానికి కూడా వెనకాడకూడదని అన్నారు. అదే విధంగా చాలా మంది తిండి విషయంలో సిగ్గుపడుతూ ఉంటారు. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది తిండి విషయంలో అస్సలు సిగ్గు పడొద్దు. ఆకలితో ఉన్న వ్యక్తి తన శరీరాన్ని మనసును నియంత్రించలేడు ఆ టైంలో ఆలోచించడంతో పాటుగా అర్థం చేసుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.

అలాగే ఎప్పుడైనా మీరు చదువుకి సంబంధించిన సందేహాలు ఉంటే ఎవరినైనా అడగడానికి లేదా ఉపాధ్యాయుని అడగడానికి సిగ్గుపడకూడదు. ఇలాంటప్పుడు మీరు వెనకడుగు వేశారంటే కచ్చితంగా మీరు ఎప్పుడూ ఏ విషయాలను తెలుసుకోలేరు. అక్కడితో ఆగిపోతారు. కొందరికి తప్పు, ఒప్పు మధ్య తేడా తెలిసినా మాట్లాడడానికి సంకోచిస్తారు. ఒక వ్యక్తి తన అభిప్రాయాలని బహిరంగంగా వ్యక్తం చేయాలి. ఏ విషయంలో అస్సలు వెనకడుగు వేయకూడదు కాబట్టి ఈ విషయాల్లో ఎప్పుడూ కూడా సిగ్గుపడడం మంచిది కాదు ఈ విషయంలో సిగ్గుపడ్డారంటే మీరే ఇబ్బంది పడాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news