సాధారణంగా తిరుమలలో వీఐపీ దర్శనాలే కాదు.. వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలుంటాయనే విషయం కూడా చాలా మందికి తెలిసిందే. ఒక్క తిరుమలలోనే కాదు.. దేశంలోని పలు దేవాలయాల్లో వీఐపీ దర్శనాలుంటాయి. ప్రొటోకాల్ ప్రకారం.. దానిని కొనసాగిస్తారు. తాజాగా తిరుమల వెళ్లిన జడ్చర్ల
ప్రసిద్ధ ఆలయాలలో ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతి దేవస్థానానికి సిఫార్సు లేఖలతో వచ్చిన వారిని దర్శనానికి అనుమతించకపోవడం బాధాకరమన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం తెలంగాణ, ఏపీ తనకు రెండు కళ్లలాంటివని చెప్పారని.. ఇక్కడ మాత్రం తెలంగాణ నుంచి సిఫార్సు లేఖలపై వచ్చిన వారిని అనుమతించడం లేదని వాపోయారు. అంటే సీఎం చంద్రబాబు ఇప్పుడొక కన్నును తీసేసుకున్నారా ? అని ప్రశ్నించారు. తెలంగాణలో యాదగిరిగుట్ట, భద్రాచలం దేవస్థానాలకు వచ్చే భక్తులకు ఆంధ్రా నాయకులు ఇచ్చే సిఫార్సు లేఖలను తాము అనుమతించి దర్శనాలు కల్పిస్తున్నామని గుర్తు చేశారు. కానీ తమ సొంత
మనుషులు, పార్టీ కార్యకర్తలు తిరుమలకు వస్తే కనీసం రూమ్ లు కూడా ఇవ్వడం లేదని
ఆరోపించారు. ఏపీలో అధికారంలో ఒక ప్రభుత్వం ఉంటే.. ప్రతిపక్షంలో ఉన్న వారు హైదరాబాద్ లో ఆశ్రయం పొందుతారని.. అయినా తాము ఏనాడు ఒక్కమాట కూడా అనలేదన్నారు.