రాత్రిపూట ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి తినకూడని ఆహారం తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. అదే విధంగా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే రాత్రిపూట ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని అస్సలు మర్చిపోయి కూడా తీసుకోవద్దు. ఎందుకంటే వీటి వల్ల చాలా సమస్యలు వస్తాయి. మరి ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా దీని కోసం పూర్తిగా చూద్దాం.
ఆల్కహాల్:
రాత్రిపూట ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. నిద్రలేమి సమస్యలు మాత్రమే కాకుండా యాసిడ్ రిఫ్లెక్స్ లాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రాత్రిపూట అల్కహాల్ తీసుకోవద్దు.
హెవీగా ఉండే ఆహార పదార్థాలు:
ఫ్రైడ్ ఫుడ్స్, చీజ్ బర్గర్స్ ఇలా హెవీ గా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అలానే తిరగడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది.
ఎక్కువ నీటి శాతం ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవద్దు:
బాగా నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల మధ్య రాత్రి లో లేవాల్సి వస్తుంది కాబట్టి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు అంటే పుచ్చకాయ, కీరదోస వంటివి తీసుకోవద్దు.
స్పైసీ ఫుడ్స్:
బాగా స్పైసీగా ఉండే ఆహార పదార్థాలు తినడం చాలా మందికి ఇష్టం. అయితే రాత్రి నిద్ర పోయేటప్పుడు అటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు దీని వల జీర్ణ సమస్యలతో పాటు మరి కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలానే కెఫీన్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవద్దు.
అసిడిక్ ఫుడ్స్:
అసిడిక్ ఫుడ్స్ ను తీసుకోకూడదు. సిట్రస్ జ్యూస్, పచ్చి ఉల్లిపాయ, వైట్ వైన్, టమాటో సాస్ వంటివి తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. అలానే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.