టీ తాగేటప్పుడు ఈ పదార్ధాలని పొరపాటున కూడా తీసుకోకండి..!

-

చాలా మందికి టీ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ప్రతి రోజు ఒక కప్పు టీ పడకపోతే వాళ్లు రోజు మొదలు పెట్టలేరు. కొందరి ఇళ్ళల్లో అయితే గంట గంటకు కూడా టీ తాగుతూ ఉంటారు. అయితే టీ తాగే వాళ్ళు కచ్చితంగా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

 

టీ తాగేటప్పుడు అసలు ఈ ఆహార పదార్థాలు తీసుకోకూడదు. వీటిని తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే మరి టీ తాగేటప్పుడు కానీ తాగడానికి ముందు, తాగిన తరవాత ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.

పచ్చికూరగాయలు, ఆకు కూరలు:

మీరు టీ తాగడానికి ముందు కానీ టీ తాగిన తర్వాత కానీ ఆకుకూరల్ని, పచ్చి కాయగూరల్ని అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ కనుక మీరు అలా తీసుకున్నట్లయితే పచ్చి కూరలో ఉండే గోయిట్రోజన్లు ఇబ్బంది తీసుకొస్తాయి. దీని వల్ల ఐయోడిన్ లోపం కలుగుతుంది. కాబట్టి టీ కి ముందు కానీ తర్వాత కానీ అస్సలు పచ్చికూరగాయలు తీసుకోకండి. అలానే బ్రోకలీని కూడా అస్సలు తీసుకోకూడదు. ఇది కూడా ఇబ్బందులు తీసుకువస్తుంది.

మొలకెత్తిన గింజలు:

మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. అయితే నిజానికి మొలకెత్తిన గింజలు టీ తో తీసుకోకూడదు. అలానే ముందు కానీ టీ తర్వాత కానీ తీసుకోకూడదు.మొలకెత్తిన గింజల్లో ఫైటేట్ ఎక్కువగా ఉంటుంది భాస్వరం యొక్క మూలకంగా ఇది పనిచేస్తుంది కాబట్టి టీతో పాటు మొలకెత్తిన గింజలు కూడా తీసుకోకూడదు. తీసుకుంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version