ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ బలహీనతని కూడా బలంగా మార్చుకుంటారో అప్పుడు తప్పక విజయం అందుకోగలరు. అయితే కొన్ని కొన్ని పద్ధతుల్ని కనుక మీరు అనుసరిస్తే అది సాధ్యం. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే…
మీ బలహీనతని మీరు యాక్సెప్ట్ చేయండి:
కొన్ని కొన్ని సార్లు మీ బలహీనతల్ని మీరు దూరం పెట్టడం, లేదంటే వాటి జోలికి వెళ్లకుండా ఉండిపోవడం చేయొద్దు. వాటిని కూడా మీరు కనిపెట్టి దానిని కూడా మీరు బలంగా మార్చుకోవాలి.
మంచిగా గైడెన్స్ తీసుకోండి:
మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉందో వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోండి. ఇలా గైడెన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే…? మీరు మరింత బాగా ఆ పనిని పూర్తి చేయగలరు. కాబట్టి మీకు నమ్మకం ఉన్న వ్యక్తుల దగ్గర గైడెన్స్ తీసుకోండి. ఇది నిజంగా వర్క్ అవుట్ అవుతుంది ప్రయత్నించండి.
ప్రిపరేషన్ :
అన్నిటిలోను ప్రిపరేషన్ చాలా ముఖ్యం. మీరు పదే పదే ప్రాక్టీస్ చేయడం.. దేనిలో అయితే మీరు గెలవాలి అనుకుంటున్నారో దానిలో ఎక్కువగా ప్రిపేర్ అవ్వడం చేయాలి.
మీ పట్ల శ్రద్ధ తీసుకోండి:
మీరు చేసే ప్రతి పని గమనిస్తూ ఉండండి. అలాగే కొన్ని కొన్ని సార్లు మీరు మారాలి. ఇలా మీ తప్పు అని గమనించి మీరు సరైన క్రమం లో మారారు అంటే తప్పకుండా మీరు గెలవడానికి సాధ్యమవుతుంది. దీనితో మీ బలహీనత కూడా బలంగా మారుతుంది.