బ్రేకింగ్: ఢిల్లీ పర్యటనకు జగన్

ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో ముందు అడుగు వేసింది, కమర్షియల్ సీక్రెట్ జాబితాలో విశాఖ ఉక్కు పరిశ్రమ వివరాలను చేర్చింది.

దీంతో సిఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే ఆయన అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని జగన్ ఇప్పటికే ఒక లేఖ కూడా రాసారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కేంద్రానికి లేఖ రాసి విక్రయించవద్దు అని కోరారు. అయినా కేంద్రం తగ్గడం లేదు. ఎంపీలతో కలిసి జగన్ ఢిల్లీ వెళ్తున్నారు.