బ్యాంకులు ఎఫ్‌డీలపై విధించే టీడీఎస్‌ను తగ్గించుకోవాలంటే ఇలా చెయ్యండి….!

-

చాల మంది డబ్బులని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. దీనితో ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇది భద్రతకు హామీ ఇస్తుంది. కానీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పై వడ్డీ పూర్తిగా పన్ను పరిధి లోకి వస్తుంది. అయితే కొన్ని బ్యాంకులు కస్టమర్ల కోరిక మేరకు ఎఫ్‌డీలపై టీడీఎస్‌ను కొంత వరకు తగ్గిస్తాయి. ఎఫ్‌డీల పై విధించే టీడీఎస్‌ను తగ్గించుకోవాలంటే ఏం చెయ్యచ్చు అనేది చూద్దాం.

ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే మీరు సంపాదించిన వడ్డీ పై టీడీఎస్‌ చెల్లించాల్సిన అవసరం లేదు గమనించండి. అయితే వివిధ ఎఫ్‌డీలపై బ్యాంకులు 10 శాతం చొప్పున టీడీఎస్‌ను తగ్గించుకొంటాయి. ఖాతాదారుడు పాన్‌కార్డు నెంబర్‌ జత చేసిన తర్వాత అతనికి ట్యాక్స్ ‌లో రాయితీ కల్పిస్తారు.

ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా వుంది అని బ్యాంకుకు తెలియజేయాలి. ఫారం 15జీ లేదా 15 హెచ్‌ను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. ఇవి సెల్స్‌ డిక్లరేషన్‌ ఫారాలు. ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉందని తగిన ఆధారాలు సమర్పించాలి అప్పుడే మీకు పన్ను మినహాయింపు వస్తుంది.

60 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి రూ.2.5 లక్షల లోపు ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుంది గమనించండి. అదే ఒక వేళ 60 నుండి 80 ఏళ్ల లోపు వారికి రూ.3 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుంది. 80 ఏళ్ల వయసు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఇస్తారు. ఇలా దీనిని మీరు తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news