బ్రౌన్ బ్రెడ్ తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

-

బరువు తగ్గాలనుకునేవారికి, మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కు బ్రౌన్ బ్రెడ్ చాలామంది తీసుకుంటారు. మాములు బ్రెడ్ కంటే.. బ్రౌన్ బ్రెడ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిదా కాదా అనే డౌట్ కొందరిలో ఉంటుంది. ఈరోజు మనం ఈ బ్రెడ్ వాడకం కరెక్టేనా..కాదా అనేది చూద్దాం.

గుండె ఆరోగ్యానికి మంచిది: బ్రౌన్ బ్రెడ్ ఒక సర్వింగ్ 28 గ్రాముల ధాన్యపు పోషకాలను అందిస్తుందట. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా చక్కగా పనిచేస్తుంది. గోధుమలను మితంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: వైట్ బ్రెడ్‌కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. గోధుమపిండిలోని పీచు పేగు కదలికను పెంచుతుంది. కాబట్టి ఇది సహజ భేదిమందులా పనిచేసి జీర్ణక్రియను ,పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

బ్రౌన్ కలర్ ఆరోగ్యానికి మంచిదేనా?

బ్రౌన్ బ్రెడ్ ను గోధుమ పిండి, నీరు, ఉప్పు, చక్కెర ,ఈస్ట్ తో తయారు చేస్తారు. అయితే ఇది బ్రౌన్ కలర్ లో ఎందుకు ఉంటుందంటే.. కారామెల్ రంగు కొన్నిసార్లు బ్రౌన్ బ్రెడ్ రంగును మెరుగుపరచడానికి మిళితం చేస్తారని చెబుతారు. అందువల్ల, కొనుగోలు ముందు లేబుల్‌ని తనిఖీ చేయడం మంచిది.

క్రానిక్ ఇన్ఫ్లమేషన్ : ఆహారంలో తృణధాన్యాలు చేర్చడం వల్ల దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో సహాయపడుతుందని సైంటిస్టులు కనుగొన్నారు. బ్రౌన్ బ్రెడ్ తృణధాన్యాలకు మంచి మూలం, ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ మంచిదని ఇప్పటికే చాలా మంది నిపుణులు పేర్కొన్నారు. వైట్ బ్రెడ్ ను మైదాతో తయారుచేయడం వల్ల ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. మైదాతో తయారుచేసిన ఏది కూడా మన ఆరోగ్యానికి మేలు చేయదు. ఫ్యాట్ నింపుతుంది.

మల్టీ గ్రైన్ బ్రెడ్ లో ఊక మరియు ధాన్యం గింజలు గ్లైసెమిక్ సూచికను తక్కువగా ఉండేలా చేస్తాయి. గ్లైసెమిక్ సూచి తక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవటం వలన మధుమేహం, క్యాన్సర్ మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. మల్టీ గ్రైన్ బ్రెడ్ లో ఫ్యుతోన్యూట్రియన్ అనే యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించటానికి సహాయపడతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version