పెరుగు, పంచదార కలిపి తింటున్నారా..? ఈ సమస్యలు తప్పవు

-

చాలమందికి పెరుగు, చెక్కర కలిపి తినే అలవాటు ఉంటుంది. ఇంకా ఈ సమ్మర్‌ సీజన్‌లో ఇలా తింటే కడుపు చల్లగా ఉంటుందని తెగ తింటారు. కానీ ఈ రెండు కలిపి తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి తెలుసా..? రోజూ మీకు వీటిని కలిపి తినే అలవాటు ఉంటే కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!!

పెరుగులో చక్కెర కలిపి రోజూ తింటే దంతాలు త్వరగా కుళ్లిపోతాయి. చక్కెర మీ దంతాలను అనేక విధాలుగా దెబ్బతీస్తుంది. పెరుగులో పంచదార తింటే దంతాలు పుచ్చిపోతాయి. అలాంటి సమయంలో పెరుగులో పంచదార కలిపి తింటే అనేక సమస్యలు తలెత్తుతాయి.

పెరుగులో చక్కెర కలిపి తింటే గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి. చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి, ఇది రక్తపోటును పెంచుతుంది. అధిక రక్తపోటు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

చక్కెరతో కలిపిన పెరుగు తినడం వల్ల మీ బ్లడ్ షుగర్ స్పైక్ అవుతుంది. ఇది చాలా ప్రమాదం.. దీని కోసం ఎల్లప్పుడూ సాధారణ పెరుగు తినండి. అలాగే, మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే.. చెక్కర వాడకం తగ్గించాలి.. వీలైనంత వరకు చక్కెర తీసుకోవడం మానుకోండి.

ఎక్కువ చక్కెర తినడం వల్ల గట్ మైక్రోబయోమ్‌లో అసమతుల్యత ఏర్పడుతుంది, ఇది జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఇది కొంతమందిలో విరేచనాలకు కారణమవుతుంది.

లాక్టోస్ అసహనం మరియు చక్కెర సున్నితత్వంతో సమస్యలు ఉంటే, అప్పుడు పెరుగు మరియు చక్కెర కలయికను నివారించాలి. ఎందుకంటే ఇది డయేరియా ప్రమాదాన్ని పెంచుతుంది.

పెరుగు, చక్కెర మిశ్రమం కేలరీలతో నిండి ఉంటుంది. అందుకే దీన్ని రోజూ తీసుకోవడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. అంతే కాదు శరీరంలోని అనేక సమస్యలను కూడా కలిగిస్తుంది.

కాబట్టి..పెరుగును పెరగును పెరుగులానే తినాలి.. పెరుగుతో పాటు పంచదార తింటే తియ్య తియ్యగా బానే ఉంటుంది కానీ.. అనవసరంగా లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇప్పటికే మీకు ఈ అలవాటు ఉంటే ఇకనైనా తగ్గించండి లేదా మానేయండి ఉత్తమం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version