ఆరోగ్యానికి పాలు చాలా మేలు చేస్తాయి. పాలల్లో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఎముకలు దృఢంగా మార్చడానికి పాలు మనకి ఎంతగానో సహాయం చేస్తాయి. పంటి ఆరోగ్యానికి కూడా పాలు మనకి హెల్ప్ చేస్తాయి. పిల్లల నుండి పెద్దల వరకూ ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
ఆయుర్వేదం ప్రకారం పాలను తాగడం వల్ల ఈ సమస్యలకు దూరంగా ఉండొచ్చని చెప్పారు. అయితే పాలను ఎవరు తాగకూడదు అనే దాని గురించి ఆయుర్వేద నిపుణులు చెప్పారు. అయితే పంచకర్మ స్పెషలిస్ట్ ఆయుర్వేద డాక్టర్ అసలు ఈ సమస్యలు ఉన్న వాళ్ళు పాలకు దూరంగా ఉండాలని మర్చిపోయి కూడా పాలను తీసుకోకూడదని చెప్పారు. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం ఇప్పుడు చూద్దాం.
దగ్గు, జలుబు:
దగ్గు జలుబు వంటి సమస్య ఉంటే పాలకి దూరంగా ఉండాలి ఈ సమస్యతో బాధపడే వారు పాలను తీసుకుంటే సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కనుక పాలని అసలు దగ్గు, జలుబుతో బాధపడేవారు తీసుకోకండి.
చర్మ సంబంధిత సమస్యలు:
చర్మ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు కూడా పాలను తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలానే దురదలు ఉన్న వాళ్లు కూడా పాలకు దూరంగా ఉంటే మంచిది.
బరువు పెరిగిపోవడం:
మీరు బాగా బరువుగా ఉన్నట్లయితే పాలను తీసుకోకండి. పాలను తీసుకోవడం వల్ల మరింత కొవ్వు వచ్చే అవకాశం ఉంటుంది.
ముక్కు, చెవులు గొంతులో దురదలు కలగడం:
ఈ సమస్య ఉన్న వాళ్లు కూడా పాలకి దూరంగా ఉంటే మంచిది. ఈ పైన ఉన్న సమస్యలు కనుక మీకు ఉంటే కావాలంటే రాత్రి పూట వేసవికాలంలో పాలు తీసుకోవచ్చు. అయితే ఆహారం ఆలస్యంగా తిని పాలు తాగడం వల్ల ఇబ్బంది వస్తుంది. కనుక ఈ జాగ్రత్తలు తీసుకుని పాల విషయంలో జాగ్రత్త పడితే మంచిది.