పూర్వం మన దేశాన్ని ఎంతోమంది రాజులు పరిపాలించారు. వారిలో గుప్తులు, మౌర్యులు, శాతవాహనులు, కాకతీయులు, చోళులు ఇలా ఎంతో మంది రాజులు ఎన్నో రాజ్యాలను ఏకఛత్రాధిపత్యం పరిపాలించారు. వీరందరికీ మన దేశ చరిత్రలో భాగంగా మంచి గుర్తింపు పొందారు. అయితే మనకు తెలియని ఒక గొప్ప సామ్రాజ్యం కూడా ఉంది? ఆ సామ్రాజ్యం గురించి ఎక్కడ ఏ పుస్తకాలలో కూడా లేదు? అదే అహోం సామ్రాజ్యం. అహోం సామ్రాజ్యం గురించి పుస్తకాల్లో ఎందుకు లేదు.. అసలు దాని చరిత్ర ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఎంతో పేరుప్రఖ్యాతులు గాంచిన అహోం సామ్రాజ్యం 1228 నుండి 1826 వరకు కొనసాగింది. తరువాత బర్మా వారు సామ్రాజ్యంపై దండెత్తి అహోం సామ్రాజ్యాన్ని వారి సొంతం చేసుకున్నారు. తర్వాత బ్రిటిష్ వారి రాకతో అహోం సామ్రాజ్యం వారి పాలనలోకి వెళ్ళింది.
ఈ సామ్రాజ్యానికి ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంతోమంది రాజులు అహోం సామ్రాజ్యంపై దండెత్తిన ఎవరూ కూడా విజయం సాధించలేకపోయారు. అంతటి గొప్ప చరిత్ర ఉంది అహోం సామ్రాజ్యానికి.
ఒకప్పుడు మొగల్ సామ్రాజ్యం, ఎన్నో ఆధునిక పరికరాలు, భారీ సైన్యం ఉండికూడా అహోం సామ్రాజ్యంపై 17 సార్లు దండెత్తి పరాజయం పాలైంది. అహోంపై రామ్ సింగ్ అనే చక్రవర్తి భారీ సైనిక బలగంతో దండెత్తి యుద్ధం చేశారు. అంతటి భారీ సైనిక సంపత్తి కలిగిన రామ్ సింగ్ చక్రవర్తి పరాజయం పాలయ్యారు. ఎంతో ఘన చరిత్ర అహోం సామ్రాజ్యానికి ఉంది.
అహోం సామ్రాజ్యాన్ని లక్ చిత్ అనే యోధుడు పాలించాడు. ఇతను ఎంతో పరాక్రమశాలి. ఇతని పాలనలో అహోం సామ్రాజ్యం చాలా శక్తివంతంగా ఉండేది. భారత దేశంలో ఎన్నో సామ్రాజ్యాల చరిత్రను చదువుకున్నారు కానీ అంతటి గొప్ప శక్తివంతమైన అహోం సామ్రాజ్యం గురించి ఎక్కడా లేకపోవడం కొద్దిగా బాధాకరమైన విషయమే. అయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పాసైన అభ్యర్ధులకు లక్ చిత్ మెడల్ అందజేస్తారు. ఆ సామ్రాజ్యానికి చెందిన వీరుడిని గుర్తు చేసుకుంటూ మెడల్ ను అందజేస్తారు.