సెలబ్రెటీల బాడీగార్డులు, వారి వ్యక్తిగత డ్రైవర్లకు ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కంటే ఎక్కువ శాలరీలు ఉంటాయి.. కొన్నిసార్లు అనిపిస్తుంది.. అసలు చదువుకునేబదులు..ఇలాంటి జాబ్‌లు తెచ్చుకుంటే బాగుండూ అని.. సెలబ్రెటీల ఇంట్లో.. నానీలు, ఆయాలకు కూడా లక్షల్లో జీతం ఉంటుంది తెలుసా..? అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట గురించి మనందరికీ బాగా తెలుసు.. క్యూట్ కపుల్.. సాధారణంగా.. ఫ్యాన్స్ ఎవరో ఒక్కరికి మాత్రమే ఉంటారు. కానీ ఈ జంటకు మాత్రం టూ సైడ్స్‌నుంచి ఉంటారు. అంత క్రేజ్ ఉంటుంది.. విరాట్, అనుష్క జంట అంటే.. వీళ్లు వీళ్ల బాడీగార్డ్స్‌కు ఎంత శాలరీ ఇస్తున్నారో తెలుసా..?
అనుష్క, విరాట్ బాడీగార్డ్ పేరు సోనూ. అతడు చాలా సంవత్సరాలుగా అనుష్క దగ్గరే పని చేస్తున్నాడు. పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేసే వారి జీతం కంటే.. అతడికే ఎక్కువ. బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ క్రికెటర్ విరాట్ కోహ్లీ భారతదేశంలోనే ఫేమస్ జంట. వీళ్లకు ఓ బాడీగార్డ్ ఉన్నాడు. చాలా మంది ప్రముఖుల మాదిరిగానే.. కోహ్లీ, అనుష్క తమ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఫాలో అవుతారు. సెక్యురిటీ పరంగా కాస్త ఆలోచిస్తారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటారు. తన సేవలకుగానూ.. అనుష్క, కోహ్లీ నుండి భారీ జీతం అందుకుంటాడు.
విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకోవడానికి ముందు కూడా అనుష్క బాడీగార్డ్ గానే సోను ఉన్నాడు. జూమ్.కామ్ ప్రకారం.. ప్రకాష్ సింగ్(సోనూ) వార్షిక వేతనం దాదాపు రూ. 1.2 కోట్లు. ఇది చాలా కంపెనీల CEOల CTC కంటే ఎక్కువ. ఈ స్టార్ కపుల్ సోనూని బాడీగార్డ్ కంటే ఎక్కువగా చూసుకుంటారట.. ఇంట్లో కుటుంబ సభ్యుడిలానే ట్రీట్ చేస్తారు. అతడు కుటుంబంలో భాగమయ్యాడని కోహ్లీ, అనుష్క సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
అనుష్క ప్రతి సంవత్సరం సోనూ పుట్టినరోజును జరుపుతుంది. గతంలో ‘జీరో’ సినిమా సెట్స్‌లో సోనూ పుట్టినరోజు జరిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో కోహ్లీ భద్రతను కూడా సోనూ చూసుకుంటాడు. అనుష్క గర్భంతో ఉన్నప్పుడు సోనూ ఆమెతోనే ఉండేవాడు. ఇంట్లో మనిషిలా చూసుకునేవాడు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ముంబయికి వెళ్లినప్పుడు, విదేశాలకు వెళ్లినప్పుడు తమ భద్రతను చూసుకుంటాడు.
ఈ సూపర్ కపుల్‌కు భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉంది. వారి అభిమానులు ఫొటోలను తీసుకునేందుకు ఆసక్తిగా ఉంటారు. అలాంటప్పుడు సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అనుష్క వ్యక్తిగత బాడీగార్డ్ సోను విరాట్‌కు కూడా వన్ మ్యాన్ ఆర్మీ. సోనూకు అనుష్క భారీ మొత్తంలో పారితోషికం చెల్లిస్తుంది. విరాట్‌తో పెళ్లికి ముందు కూడా అతను ఉన్నాడు.