బంగారు గని వద్దకు వెళ్తుండగా బస్సు ప్రమాదం.. 17 మంది కార్మికులు దుర్మరణం

-

అఫ్గానిస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంగారం తవ్వడానికి కార్మికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. తఖర్ ప్రావిన్స్‌లోని చాహ్ అబ్ జిల్లా.. అంజీర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

బంగారు గని వద్దకు కార్మికులు వెళ్తుండగా అంజీర్ ప్రాంతంలోని చాహ్ అబ్ సెంటర్, గనుల మధ్య బస్సు బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు చెప్పారు.

వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్​ 2020 నివేదిక ప్రకారం.. ప్రపంచంలో ప్రమాద మరణాల పరంగా అఫ్గానిస్థాన్ 76వ స్థానంలో ఉంది. అఫ్గానిస్థాన్​లోని దారుణమైన రోడ్లు, అంతగా అభివృద్ది చెందని రహదారులు కారణంగానే ఇక్కడ అంతగా రోడ్డు ప్రమాదాలు జరిగి.. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news