పూజలో నైవేద్యం ఎంత ముఖ్యమో.. కర్పూరం, ఊద్‌బస్తీలు కూడా అంతే ముఖ్యం.. వీటి వాసనతోనే మనకు ఒక డివోషనల్ ఫీల్ వస్తుంది. కర్పూరం వెలగిస్తే.. కొద్దిసేపటికే అయిపోతుంది. కర్పూరాన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఏ సమస్యలకు కర్పూరాన్ని వాడొచ్చో మీకు తెలుసా..? అలాగే మనం ఈరోజు కర్పూరం ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.
కర్పూరం ఎలా చేస్తారంటే..
సినమోమం చంపోరా అనే చెట్టు నుంచి ఈ కర్పూరం వస్తుంది. దీన్నే మనం కర్పూరం చెట్టు అంటుంటాం. దీని వేర్లు, చెక్క, బెరడు, విత్తనాలు, ఆకులను ప్రాసెస్ చేసి కర్పూరం, పచ్చ కర్పూరం, కర్పూర నూనె తదితరాలను తీస్తారు. అయితే ఇప్పుడు సహజమైన కర్పూరం కంటే మార్కెట్లో సింథటిక్ కర్పూరం పెరిగిపోయింది. దీన్ని ఆరోగ్య అవసరాల కోసం వాడకుండా ఉండటమే ఉత్తమం అని నిపుణులు అంటున్నారు. సహజమైన కర్పూరం దొరికితే గనుక దాని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..
కర్పూరం ఉపయోగాలు:
ఊపిరితిత్తులు, గొంతుల్లో వాపులు, అలర్జీలతో బాధపడేవారికి ఇది చక్కగా పని చేస్తుంది. అలాగే ముక్కు పూడుకుపోయి శ్వాస అందకపోవడం, దగ్గు ఎక్కువగా రావడం లాంటి సమస్యలు ఉన్న వారూ దీన్ని తరచూ వాసన చూడటం వల్ల ఫలితం ఉంటుంది.
నరాల్లో ఒత్తిడిని తగ్గించడం ద్వారా నొప్పులు, దురదలను ఇది తగ్గిస్తుంది. శరీరంపై సమస్యాత్మక ప్రాంతంలో ఈ కర్పూరం లేదా కర్పూర నూనెను పది శాతం తీసుకుని దానికి మరో 90 శాతం కొబ్బరి నూనెను కలపుకోని రాసుకోవడం వల్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి. అలాగే చర్మానికి చల్లదనం కలిగి హాయిగా ఉంటుంది.
కర్పూరం ఉన్న స్ప్రేని ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవాళ్లు పూసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. అయితే ఇది నొప్పిని తగ్గించి హాయినిస్తుంది గానీ లక్షణాలను తగ్గించదని పరిశోధకులు చెబుతున్నారు.
ఒక్కొక్క సారి సడన్‌గా లోబీపీ సమస్య ఇబ్బంది పెడుతుంటుంది. అలాంటప్పుడు హవ్తోర్న్ ఎక్స్‌ట్రాక్ట్‌కి కర్పూరం కలిపి లోపలికి తీసుకోవడం వల్ల బీపీ మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.
కప్పు నీటిలో కర్పూరం వేసి పడుకునే గదిలో పెట్టుకోవడం వల్ల దోమలు రావు. అలాగే దీనికున్న ఘాటైన వాసన వల్ల పురుగులు కూడా రావట.
వర్షాకాలంలో చేతులు, కాలి గోళ్లకు ఇన్‌ఫెక్షన్లు, గోరు చుట్లలాంటివి వస్తుంటాయి. యూకలిప్టస్ నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి వీటికి రాసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.