చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2 . ఇక ఈ సినిమాలో సత్య, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్ర పోషించారు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అని చెప్పవచ్చు. అతి తక్కువ సమయంలోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయిన ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి మూడు సంవత్సరాలు అవుతోంది. కరోనా ఆలస్యం అవుతూ వచ్చినా ఎట్టకేలకు ఆగస్టు 13వ తేదీన విడుదల చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. శ్రీ కృష్ణుడు చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా భారతీయ ఆనవాళ్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి అని చెబుతూ ఒక ఆసక్తికరమైన నోడులో దర్శకుడు తీసుకెళ్లే విధానం సఫలం అయ్యిందని చెప్పవచ్చు. ఈ సినిమా హిందీలో రాబడుతున్న వసూలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇక ఇప్పటివరకు నిఖిల్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా బాలీవుడ్ లో కనీసం శాటిలైట్ ద్వారా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దర్శకుడు చందు మండేటి కూడా హిందీలో గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. కానీ కార్తికేయ 2 సినిమాతో మంచి వసూళ్లు రాబట్టడమే కాకుండా సినిమా కాన్సెప్ట్ కూడా అక్కడి వారికి నచ్చడంతో సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఇప్పుడు నిఖిల్ కూడా పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు అనడంలో సందేహం లేదు.
ఇకపోతే ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ. 20 కోట్లలోపే ఉన్నట్లు సమాచారం కానీ ప్రస్తుతం రూ.100 కోట్లు వసూలు చేస్తున్న ఈ సినిమాకు గాను నిఖిల్ కి కేవలం రూ.3కోట్ల పారితోషికం మాత్రమే ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే లాభాలలో వాటా ఇచ్చే విధంగా ఒప్పందం కూడా జరిగింది అని కొంతమంది చెబుతున్నారు. ఈ సినిమా సక్సెస్ అయింది కాబట్టి ఆయన తర్వాత సినిమా పారితోషికం రూ.10 కోట్లకు చేరుకున్నా.. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.