జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి, టిడిపి ను స్వాధీనం చేసుకోవాలని కోరారు లక్ష్మి పార్వతీ. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు కు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు. విమర్శలు చేస్తున్న వారు, తెలుగు భాష అభవృద్ధికి కృషి చేస్తున్నాము అంటున్న వారు వాళ్ళ పిల్లలు నీ ఆంగ్ల భాషలో చదివించడం లేదా ? పేద పిల్లలు ఆంగ్ల బాషా అందుటులోకి తీసుకు వచ్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందని తెలిపారు.
తెలుగు కు సీఎం జగన్ ద్రోహం చేశారు అంటున్న వాఖ్యలు అవాస్తవాలు అని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో తెలుగు స్కూల్స్ ను పెద్ద సంఖ్యలో మూసి వేశారని మండిపడ్డారు. తెలుగు మరియు సంస్కృత అకాడమీ కు టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి తిరుపతి గోశాల వద్ద స్థలం కేటాయించారు.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి, టిడిపి ను స్వాధీనం చేసుకోవాలని కోరారు. 2014 లో తర్వాత జరిగిన తెలుగు అకాడమీ లో తెలంగాణ లో మొత్తం 65 కోట్లు దుర్వినియోగం జరిగింది, 10 కోట్లు బ్యాంకులు రికవరీ జరిగిందని వివరించారు లక్ష్మి పార్వతీ.