షేక్స్పియర్ రచించిన పుస్తకం ఎన్ని కోట్లు కు అమ్ముడు పోయిందో తెలుసా..?!

-

విలియం షేక్స్ పియర్ పరిచయం అక్కర్లేని పేరు. ఇంగ్లీష్ నవల్స్ చదివేవారికి షేక్స్ పియర్ పుస్తకాలంటే క్రేజ్. ఆయన రాసిన పుస్తకాలు, నాటకాలను ఇప్పటికీ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందంటే అతిశయోక్తికాదు. షేక్స్ పియర్ రాసిన నవల్స్ ఆధారంగా చాలా సినిమాలను కూడా రూపొందించారు. అయితే గతంలో ఆయన రాసిన పుస్తకాలను వేలం వేయగా భారీ ధర పలికాయి కూడా. తాజాగా షేక్స్ పియర్ రాసిన మరోపుస్తకాన్ని న్యూయార్క్ లో వేలం వేయగా…ఏకంగా 73 కోట్లు పలకడం విశేషం. 36 నాటకాలున్న ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ మాస్టర్ పబ్లికేషన్ ముద్రించింది.

షేక్స్ పియర్ 1632లో తన మొదటి నాటక…పుస్తకాన్ని రచించారు. ఫస్ట్ ఫోలియో పేరుతో విడుదలైన ఆ పుస్తకం చాలా మంచి ఆధరణ పొందించింది. ఈ పుస్తకాన్ని బుధవారం న్యూయార్క్ లోని క్రిస్టీలో వేలం వేశారు. కాగా వేలంలో ఈ పుస్తకానికి ఏకంగా పది మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 73కోట్ల రూపాయలు ధర పలికింది. అయితే పుస్తకానికి నాలుగు నుంచి ఆరు మిలియన్ డాలర్లు వస్తాయని ఊహించామని…కానీ తమ అంచనాలను తలకిందులు చేస్తూ…రెండు రెట్లు ధర ఎక్కువొచ్చిందని సంబరపడ్డారు నిర్వాహకులు.

Read more RELATED
Recommended to you

Latest news