కొత్తిమీర వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..!

-

కొత్తిమీర ఆకులు అన్ని రకాల కూరల్లో వాడతారు.ముఖ్యంగా శాఖాహార కూరల్లో కంటే మాంసాహార కూరల్లో ఎక్కువ వాడతారు. కొత్తిమీర నుండి వచ్చే గింజలనే ధనియాలు అంటారు. వీటి ఉపయోగం కూడా విరివిగానే ఉంటుంది. ధనియాల పొడిని ఇతర మసాలా దినుసుల తో కలిపి కూరల్లో వాడతారు.కొత్తిమీర లో అనేక పోషకాలు ఉన్నాయి.

దీని ఆకుల్లో, కాడల్లో పీచు పదార్ధాలు, విటమిన్లు, అధికం గా ఉన్నాయి. క్యాలరీలు తక్కువ. యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువ గా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. దీనిలో ప్రోటీన్స్, కాల్షియం, ఫాస్ఫరస్,ఆక్సాలిక్ యాసిడ్స్, పొటాషియం, ఐరన్, సోడియం మొదలైనవి ఉన్నాయి. కొత్తిమీర రుచి కోసమే కాకుండా ఎన్నో రకాల వ్యాదులకు చికిత్స గా కూడా ఉపయోగపడుతుంది.కొత్తిమీర ఆకులు రసం తీసి అంతే పరిమాణంతో తేనె కలిపి రోజు పడుకునే ముందు తాగితే విటమిన్స్   a, b1, b2, c, ఐరన్ లోపాలతో వచ్చే వ్యాదులు దరి చేరవు.

ఇంకా కడుపు నొప్పి, ఉబ్బసం, ఎలర్జీ లాంటి బాధలు ఉండవు. నోటి పూత,నోటి దుర్వాసన, దంతాలు పుచ్చటం అనే వాటికి ధనియాలు బాగా నములుతూ ఉంటే పై లక్షనాలన్నిటికి చెక్ పెట్టవచ్చు. తలనొప్పి వచ్చిన వారు కొత్తిమీర ఆకుల రాసాన్ని నుదుటి మీద రాస్తే తల నొప్పి తగ్గిస్తుంది. కొత్తిమీర ఆకుల రసంలో కొద్దిగా పసుపు కలిపి ప్రతి రోజు రాత్రి పడుకునేటప్పుడు రాసుకుంటే మొటిమలు తగ్గడమే కాకుండా, ఎండిపోయినట్లుగా ఉన్న ముఖ చర్మం మృదువుగా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version